- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala:భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శన టోకెన్ల జారీ పై టీటీడీ కీలక నిర్ణయం
శ్రీవారి దర్శన టోకెన్ల కోసం తిరుపతి(Tirupati)లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: శ్రీవారి దర్శన టోకెన్ల కోసం తిరుపతి(Tirupati)లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో టీటీడీ అధికారులు(TTD Officers) తాజాగా వైకుంఠ ద్వార దర్శనం స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల పై సమీక్ష నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు 19వ తేదీకి సంబంధించి ప్రస్తుతం టోకెన్లు జారీ అవుతున్నాయి. రేపటితో టోకెన్లు జారీ ముగియనున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్(TTD Chairman) సూచనల మేరకు అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో జనవరి 20వ తేదీ దర్శనానికి సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు చేశారు.
దీంతో సర్వదర్శనంలో మాత్రమే భక్తుల(Devotees)కు శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. 20వ తేదీకి సంభందించి 19వ తేదీ ఆఫ్‌లైన్‌లో శ్రీ వాణి టిక్కెట్లు జారీ కూడా రద్దు చేశారు. జనవరి 20న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫార్సు లేఖల పై VIP బ్రేక్ దర్శనం కేటాయింపు రద్దు చేశారు. 19వ తేదీ ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు టీటీడీ(TTD) తెలిపింది. భక్తులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని.. తమ తిరుమల(Tirumala) యాత్ర ప్రణాళికను రూపొందించుకొని TTDకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.






