స్థానికులకు గుడ్ న్యూస్.. రేపు శ్రీవారి దర్శన టోకెన్ల జారీ

by Vemula.Srinu Prasad |

ప్రతి నెలా తొలి మంగళవారం స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా జూన్ 1వ తేదీ ఆదివారం నాడు స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది..

స్థానికులకు గుడ్ న్యూస్.. రేపు శ్రీవారి దర్శన టోకెన్ల జారీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి నెలా తొలి మంగళవారం (జూన్ 3వ తేదీ) స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా జూన్ 1వ తేదీ ఆదివారం నాడు స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియం కౌంటర్లతో పాటు తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో భక్తులకు ఉదయం 5 గంటల నుంచిశ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని గమనించి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Next Story