- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TTD: చాగంటి పై వైరల్ అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం.. టీటీడీ చైర్మన్ క్లారిటీ
ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వర రావు గురించి వైరల్ అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం అని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు(TD Chairman BR Naidu) స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వర రావు గురించి వైరల్ అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం అని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు(TD Chairman BR Naidu) స్పష్టం చేశారు. తిరుమలలో చాగంటికి అవమానం అని వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా అసలు వాస్తవం ఇది అంటూ.. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మర్షి డా. చాగంటి కోటేశ్వర రావు(Dr. Chaganti Koteshwar Rao) ప్రతి ఏడాది జనవరి మాసంలో తిరుమల(Tiruamala) వచ్చి శ్రీవారిని సందర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఇందులో భాగంగా జనవరి 14వ శ్రీవారి దర్శనం, జనవరి 16వ తేదీ సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో(Mahathi Auditorium) ప్రవచనాలు ఇచ్చేందుకు 2024, డిసెంబర్ 20న టీటీడీ ప్రొసిడింగ్స్ ఇచ్చినట్లు తెలిపారు. చాగంటికి ఉన్న కేబినేట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి 14న శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేశామని, ఇందులోభాగంగా.. రాజబగీచ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి వారిని తీసుకెల్లేందుకు బగ్గీస్ ను, శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు టీటీడీ ఏర్పాట్లను చేసిందని వివరించారు.
అయితే వయసు రీత్యా శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా వెళ్లే సదుపాయం ఉన్నా వారు సున్నితంగా తిరస్కరించడం జరిగిందని, పలువురు ప్రముఖులు, సాధారణ భక్తుల తరహాలోనే వైకుంఠం కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయానికి చేరాలని వారే స్వయంగా సూచించారని చెప్పారు. వారి సూచనల మేరకు వారే స్వయంగా వైకుంఠం కాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారని అన్నారు. అదేవిధంగా జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో చాగంటి వారి ప్రవచన కార్యక్రమాన్ని మరొక తేదీకి వాయిటా వేస్తే బాగుంటుందని వారి దృష్టికి టీటీడీ అధికారులు తీసుకెళ్లగా.. ఈ విన్నపాన్ని చాగంటి అంగీకరించారని, తదుపరి వారి అపాయింట్మెంట్ తేదీలను మరోసారి తీసుకుని ప్రవచనాలు ఏర్పాటు చేసేందుకు టీటీడీ నిర్ణయించిందని తెలిపారు. ఇక వాస్తవం ఇలా ఉండగా.. బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని, చివరి నిమిషంలో పరిపాలనా కారణాల రీత్యా చాగంటి ప్రవచనాల కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేసినట్లు టీటీడీ ని పలుచన చేసేలా వాస్తవాలను వక్రీకరించి అసత్యపు వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్ నాయుడు స్పష్టం హెచ్చరించారు.






