కొత్త ప్రయత్నం.. వీఐపీ దర్శనాల విషయంలో TTD కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-20 11:24:37  IST  )

వీఐపీ దర్శనాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) కీలక నిర్ణయం తీసుకున్నది.

కొత్త ప్రయత్నం.. వీఐపీ దర్శనాల విషయంలో TTD కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: వీఐపీ దర్శనాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) కీలక నిర్ణయం తీసుకున్నది. బుధవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) మీడియాతో మాట్లాడారు. వీఐపీ దర్శనాలు ఉదయం 10 గంటలకు ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకే వీఐపీ దర్శనాలను రోజూ ఉదయం 8:30 గంటలకే ముగించేలా చర్యలు తీసుకుంటామని కీలక ప్రకటన చేశారు. ఒంటిమిట్టలో అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగుతోందని.. రూ.4 కోట్లతో అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అంతేకాదు.. భద్రతా చర్యల్లో భాగంగా అలిపిరిలో స్కానర్లు అప్‌డేట్ చేస్తున్నామని అన్నారు. శ్రీవారి దర్శనాలు, ప్రసాదం విషయంలో సైబర్ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించారు.

ఏడాది కాలంలోనే నకిలీ వెబ్‌సైట్‌లను క్రాష్ చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు.. సైబర్ నేరాలు జరుగకుండా సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. టీటీడీ పరిధిలోని 90 శాతం అటవీ ప్రాంతాన్ని 110 శాతానికి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. తిరుమల కల్యాణకట్టలో అత్యాధునిక పరికరాలు వాడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. హిందూ ధర్మ ప్రచారం కోసం పుస్తకాలు ముద్రించి భక్తులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీనికి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సముఖంగా ఉన్నారు. భూమి ఇవ్వగానే ఆలయ నిర్మాణాలు చేపడుతామని అన్నారు.

Next Story