- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం చంద్రబాబును కలిసిన టీటీడీ బృందం.. విషయమేంటంటే?
ఉగాది పర్వదినం సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

దిశ,వెబ్‌డెస్క్: ఉగాది పర్వదినం సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు(ఆదివారం) సీఎం చంద్రబాబు నివాసంలో(ఉండవల్లి) ఆయనను టీటీడీ బృందం కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు(EO Shyamala Rao) సీఎంకు శాలువా కప్పి.. శ్రీవారి ప్రసాదాలు అందజేశారు.
తిరుమల(Tirumala)లో భక్తుల(Devotees)కు అందుతున్న సేవల పై సీఎం చంద్రబాబు వివరాలు అడిగారు. కడప జిల్లా(Kadapa District) ఒంటిమిట్ట క్షేత్రంలో నిర్వహించే రాముల వారి కళ్యాణ మహోత్సవానికి రావాలంటూ సీఎం చంద్రబాబు(CM Chandrababu)ను ఆహ్వానించారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న కల్యాణోత్సవం జరగనుంది. అయితే.. టీటీడీ చైర్మన్‌తో పాటు వచ్చిన వేద పండితులు సీఎం చంద్రబాబుకు వేదాశీర్వచనాలు చేశారు.






