Tirumala News:శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-13 12:09:04  IST  )

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ

Tirumala News:శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల(tirumala) కొండకు చేరుకుని శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో(TTD) కొన్ని సార్లు భక్తుల(Devotees) రద్దీ అధికంగా, మరికొన్ని సార్లు స్వల్పంగా ఉంటుంది. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు ఉంటాయని ఏపీ దేవాదయశాఖ మంత్రి ఆనం రామనారయణ రెడ్డి వెల్లడించారు.

ఈ క్రమంలో శ్రీవారి బ్రేక్ దర్శనాల కోసం భక్తులు ఇచ్చే సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈ క్రమంలో ఎల్లుండి(మే 15) నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు ప్రారంభం కానునట్లు దేవాదయశాఖ మంత్రి ఆనం రామనారయణ రెడ్డి తెలిపారు. ఏపీ(Andhra Pradesh), తెలంగాణ(Telangana) ఎంపీ, ఎమ్మెల్యేలు(MLA) , ఎమ్మెల్సీ(MLCs)ల సిఫార్సు లేఖల పై బ్రేక్ దర్శనాలు కేటాయిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ(మంగళవారం) టీటీడీ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.

Next Story