- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు వైకుంఠ ద్వారదర్శనాలపై టీటీడీ సమీక్ష
వైకుంఠ ద్వార దర్శనాలపై నేడు టీటీడీ ఆధ్వర్యంలో సమీక్ష జరగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: వైకుంఠ ద్వార దర్శనాలపై నేడు టీటీడీ ఆధ్వర్యంలో సమీక్ష జరగనుంది. మంత్రులు ఆనం రాం నారాయణ రెడ్డి, అనిత, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంల ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్న నేపథ్యంలో.. భక్తులకు ఏర్పాట్లు, తీసుకోవలసిన చర్యలపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే టీటీడీ ఆదేశించింది.
తొలి మూడు రోజుల్లో మూడు ప్రాంతాలకు చెందిన భక్తులను అనుమతించేలా టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో తోపులాటలు, గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనాలు కల్పించేందుకు టీటీడీ సిద్ధమవుతంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 30వ తేదీ ఏకాదశి, 31 ద్వాదశి, జనవరి 1వ తేదీలకు సంబంఽధించి 1.76 లక్షల మందికి ఈ-డిప్ విధానంలో ముందస్తుగానే స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లను కేటాయించింది. జనవరి 2వ తేదీ నుంచి 8 వరకూ ఎలాంటి టోకెన్లు, టికెట్లు లేకపోయినా వైకుంఠం క్యూ కాంప్లెక్స్






