శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ సమీక్ష

by Naga Rani Yarlagadda |

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల (Tirumala Brahmotsavam) ఏర్పాట్లపై టీటీడీ సమీక్ష నిర్వహించింది.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల (Tirumala Brahmotsavam) ఏర్పాట్లపై టీటీడీ సమీక్ష నిర్వహించింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకూ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం సాయంత్రం అన్నమయ్య భవనంలో (Annamayya Bhavan) టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గరుడవాహనసేవ రోజున భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న క్రమంలో.. ఆ రోజు భక్తులకు అన్న, పానీయాల పంపిణీ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. కన్నుల పండువగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

Next Story