కపిలతీర్థంలో తొక్కిసలాట.. స్పందించిన టీటీడీ

by Naga Rani Yarlagadda |

మహాలయ అమావాస్య (Mahalaya Amavasya) సందర్భంగా తిరుమలలోని కపిలతీర్థంలో (Kapila Theertham) పితృ తర్పణాల కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.

కపిలతీర్థంలో తొక్కిసలాట.. స్పందించిన టీటీడీ
X

దిశ, వెబ్‌డెస్క్: మహాలయ అమావాస్య (Mahalaya Amavasya) సందర్భంగా తిరుమలలోని కపిలతీర్థంలో (Kapila Theertham) పితృ తర్పణాల కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) స్పందించింది. కపిలతీర్థంలో పితృ తర్పణాలకు సరైన ఏర్పాట్లు చేయలేదని వస్తున్నవార్తలు అవాస్తవమన్నారు. మహాలయ అమావాస్య రోజున కపిలతీర్థం ఆలయం వెలుపల ప్రైవేటు వ్యక్తులు పితృతర్పణాల కార్యక్రమాలను నిర్వహిస్తూవస్తున్నారని, ఇందుకు ప్రత్యేక క్యూలైన్లతో పాటు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్లు టీటీడీ తెలిపింది. తిరుమలకు ఈ విషయంతో సంబంధం లేకున్నా.. టీటీడీ తప్పిదమని ప్రచారం చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ దుష్ర్పచారం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Next Story