నేడు TTD పరకామణి చోరీ కేసు విచారణ.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-06 02:42:42  IST  )

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరకామణిలో జరిగిన నగదు చోరీ కేసుపై ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది.

నేడు TTD పరకామణి చోరీ కేసు విచారణ.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరకామణిలో జరిగిన నగదు చోరీ కేసుపై ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court)లో కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. పరకామణిలో జరిగిన అవకతవకలు, నగదు మాయంపై లోతైన విచారణ జరపాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు సీఐడీ (CID), ఏసీబీ (ACB) అధికారులను ఆదేశించింది. లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగినట్లుగా ప్రాథమిక ఆధారాలు ఉంటే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, పరకామణి కేసులో నేడు హైకోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనుంది.

కాగా, తిరుమల పరకామణి (Parakamani)లో భవిష్యత్తులో దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అత్యాధునిక టెక్నాలజీ వాడకంపై టీటీడీ అధికారులు ఇప్పటికే కోర్టుకు ఓ నివేదికను సమర్పించారు. దీనిపై మరింత పర్యవేక్షణ అవసరమని ధర్మాసనం చెప్పింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్ (Ravi Kumar), అతడి కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ సమర్పించిన నివేదికను కోర్టు ఇప్పటికే పరిశీలించింది. సుమారు రూ.40 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చి కేసును గతంలోనే లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Next Story