- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్వీబీసీ ఆధ్వర్యంలో మరో ఛానల్: TTD ఈవో అనిల్ కుమార్ సింఘాల్
టిటిడి స్థానిక, అనుబంధ ఆలయాల ప్రాశస్త్యం, శిల్ప సౌందర్యాన్ని భక్తులకు చేరవేసేందుకు ఆగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ సాయం తీసుకోవాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించింది...

దిశ, వెబ్ డెస్క్: టిటిడి స్థానిక, అనుబంధ ఆలయాల ప్రాశస్త్యం, శిల్ప సౌందర్యం తదితర ప్రధాన అంశాలను భక్తులకు చేరవేసేందుకు అవసరమైతే ఆగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ సాయం తీసుకుని, ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించింది. టిటిడి స్థానిక, అనుబంధ ఆలయాల ప్రాశస్త్యాన్ని భక్తులకు అందించేందుకు వర్చువల్ రియాలిటీ సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. ఆలయాల శిల్పాలు, చిత్రాలను భక్తులు సెల్ ఫోన్ తో స్కాన్ చేసినట్లు అయితే సంబంధిత పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా నూతన టెక్నాలజీతో అనుసంధానం చేయాలని చెప్పారు. అదేవిధంగా, తిరుమల శ్రీవారి ఆలయం కైంకర్యాలను ఎస్వీబీసీ ఛానల్‌లో అందిస్తున్న తరహాలో టిటిడి స్థానిక ఆలయాలు, అనుబంద ఆలయాల విశిష్టతను భక్తులకు అందించేందుకు అవసరమైతే ఎస్వీబీసీ ఆధ్వర్యంలో మరో ఛానల్ తీసుకువచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు.
భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు
టిటిడి అనుబంధ, స్థానిక ఆలయాలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ప్రత్యేక అధికారులు తరచుగా ఆలయాలను సందర్శించి ఆలయాల అభివృద్ధి పనులపై నివేదికలు రూపొందించేలా చర్యలు చేపట్టాలన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో అన్నదానం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఆలయానికి జనరల్ అకౌంట్, అన్నదానం కోసం మరో అకౌంట్ తెరిపించి సదరు రెండు అకౌంట్లను ప్రత్యేక అధికారులు పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే అన్నప్రసాదాల కోసం ఉన్న అకౌంట్లను కొనసాగించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, సిసిటివీలు, సెక్యూరిటీ, రవాణా, ట్రాఫిక్ తదితర అంశాలపై టిటిడి సివిఎస్వోతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆలయాలలో సరైన సమయానికి కైంకర్యాలు, వాహన సేవలకు సంబంధించి, ప్రధాన ఉత్సవాల నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళికలు, భక్తులకు వైద్యసేవలు, శ్రీవారి సేవకుల సేవలు, పుష్కరిణిని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు, బడ్జెట్, వ్యర్థాల నిర్వాహణ, మరుగుదొడ్లు తదితర అంశాలపై ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.






