టికెట్ లేకున్నా... రేపటి నుంచి శ్రీవారి దర్శనం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-01 08:53:19  IST  )

టోకెన్లు లేకపోయినా శుక్రవారం నుంచి భక్తులకు టీటీడీ అధికారులు శ్రీవారిని దర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు...

టికెట్ లేకున్నా... రేపటి నుంచి శ్రీవారి దర్శనం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రానిక్ డిప్‌ ద్వారా టికెట్ పొందిన భక్తులు ప్రస్తుతం స్వామివారిని దర్శించుకున్నారు. డిసెంబర్ 30 నుంచి ప్రారంభమైన ఈ దర్శనాలు కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి వారికి కేటాయించిన సమయంలో వైకుంఠ ద్వారం ద్వారా వెంకటేశ్వరుడిని దర్శించుకుని తరించిపోతున్నారు. శుక్రవారం నుంచి టోకెన్లు లేకపోయినా భక్తులకు స్వామి వారిని దర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Next Story