శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్

by Naga Rani Yarlagadda |

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)గుడ్ న్యూస్ చెప్పింది. 2026 నూతన సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)గుడ్ న్యూస్ చెప్పింది. 2026 నూతన సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అలాగే తిరుమల, తిరుపతిలోని సేల్స్ కౌంటర్, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోనున్న ధ్యాన మందిరం, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాలు, తిరుచానూరులో ఉన్న టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్ లో శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. విజయవాడ, విశాఖ, చెన్నై, హైదరాబాద్ లోని హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, వేలూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, నెల్లూరులలో ఉన్న టీటీడీ కల్యాణమండపాల్లో నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. కావలసినవారు www.tirumala.org, ttdevasthanams.ap.gove.in వెబ్ సైట్ల ద్వారా వాటిని పొందవచ్చునని వివరించింది.

Next Story