శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు... అధికారులకు కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

శ్రీ‌వారి సాలకట్ల బ్ర‌హ్మోత్స‌వాల నేపథ్యంలో అధికారులకు టీటీడీ సీవీ, ఎస్వో ముర‌ళీకృష్ణ కీలక ఆదేశాలు జారీ చేశారు..

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు... అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: సెప్టెంబ‌ర్ 24 నుంచి తిరుమల(Tirumala)లో శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు(Srivari Salakatla Brahmostavarlu) జరగనున్నాయి. దీంతో భక్తుల(Devotees) భద్రతపై తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్‌లో స‌న్నాహ‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో టీటీడీ సీవీ, ఎస్వో ముర‌ళీకృష్ణతో పాటు విజిలెన్స్, ఫైర్‌, ఎస్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. గ‌త అనుభ‌వాల‌ను దృష్టా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క‌మాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తిరుమ‌ల‌లోని ప్ర‌తి ప్రాంతంపై నిఘా ఉంచాలని, టెక్నాల‌జీని వినియోగించి భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయాల‌ని అధికారులకు టీటీడీ సీవీ, ఎస్వో ముర‌ళీకృష్ణ తెలిపారు.

బ్ర‌హ్మోత్స‌వాల్లో తొలి రోజు సీఎం ప‌ట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ఫ‌ించనున్న నేప‌థ్యంలో ప‌టిష్ట‌మైన బందోబ‌స్తు ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముర‌ళీకృష్ణ సూచించారు. పెద్ద‌శేష వాహ‌నం, గ‌రుడ వాహ‌నం, ర‌థోత్స‌వం, చ‌క్ర‌స్నానం రోజుల్లో భ‌ద్ర‌త‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని ఆదేశించారు. వాహ‌న సేవ‌ల‌ను తిల‌కించేందుకు వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా గ్యాల‌రీలు, ప్ర‌వేశ‌, నిష్క్ర‌మ‌ణ మార్గాల‌ను ప్ర‌ణాళికాబ‌ద్ధంగా రూపొందించాల‌ని చెప్పారు. బ్ర‌హ్మోత్స‌వ రోజుల్లో వాహ‌న ర‌ద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ స‌మ‌స్య త‌లెత్త‌కుండా ప్ర‌త్యేక పార్కింగ్ లు ఏర్పాటు చేయాల‌ని సంబంధిత విజిలెన్స్, సెక్యూరిటీ అధికారుల‌ను ముర‌ళీకృష్ణ ఆదేశించారు.

Next Story