అయోధ్య వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

by Satheesh |   (  Updated:2024-01-19 15:20:34  IST  )

ప్రతిష్టాత్మక అయోధ్య రామ మందిరం, రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వేళ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.

అయోధ్య వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం, రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వేళ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యకు లక్ష తిరుమల శ్రీవారి లడ్డులను పంపించనున్నట్లు తెలిపింది. రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో పంపిణీ చేసేందుకు లక్ష లడ్డులను టీటీడీ సిద్ధం చేసింది. 25 గ్రాములతో ఒక్కొ లడ్డును ప్యాక్ చేసింది. వీటిని ప్రత్యేక విమానంలో రేపు అయోధ్యకు పంపనున్నట్లు టీటీడీ తెలిపింది. కాగా, అయోధ్య ట్రస్ట్ ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం, రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22న జరగనున్న విషయం తెలిసిందే. ప్రారంభోత్సవానికి ఇప్పటికే అయోధ్య రామ మందిరం ముస్తాబైంది. ఈ మహోత్తర ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున అయోధ్యకు వెళ్తున్నారు.

Next Story