- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala:‘అక్కడ జరిగిందొకటి.. ప్రచారం చేసింది మరోటి’.. వారిపై టీటీడీ ఆగ్రహం
తిరుమల(Tirumala)లో ఇటీవల జరిగిన ఓ ఘటన పై టీటీడీ(TTD) స్పందించింది.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala)లో ఇటీవల జరిగిన ఓ ఘటన పై టీటీడీ(TTD) స్పందించింది. ఆలయ పరిధిలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, ఫోటో స్టూడియో షాపు యజమాని మధ్య జరిగిన వివాదం పై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. విషయంలోకి వెళితే.. గత నెల(జూన్) 29న తిరుమలలోని అఖిలాండం వద్ద కొంతమంది ఫోటోగ్రాఫర్‌లు లైసెన్స్ లేకుండానే అనధికారికంగా ఫోటోలు తీస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న భక్తులు(Devotees) ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఈ ఘటనను గమనించిన విధుల్లో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ఆ ఫోటోగ్రాఫర్‌ను ప్రశ్నించారు. దీంతో ఆ ఫోటోగ్రాఫర్ వెంటనే తన కెమెరాను వేరే వ్యక్తికి ఇచ్చి పంపించేశారు.
ఈ క్రమంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ఆ కెమెరాను తిరిగి తెప్పించాలని డిమాండ్ చేశారు. ఆ ఫొటోగ్రాఫర్ కెమెరా తీసుకరానని అన్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ ఫొటోగ్రాఫర్ అసభ్య పదజాలంతో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును దూషించారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఆస్థాన మండపంలోని 96వ నంబర్ షాపు వద్ద గొడవ పడ్డారు. ఈ ఘటన మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీనిపై ఫోటోగ్రాఫర్‌ను టీటీడీ వివరణ కోరినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ప్రవర్తించిన తీరు నియమాలకు విరుద్ధంగా ఉండడంతో అతనిని తిరుమల నుంచి విధుల నుంచి తప్పించి తిరుపతికి పంపించడం జరిగిందని తెలిపింది. ఇక్కడ జరిగింది ఇది కానీ.. కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ మీడియా ఛానెల్‌లో ప్రసారమైన తిరుమలలో తన్నుకున్న టీటీడీ సిబ్బంది వార్తను ఖండించింది. వాస్తవాలు తెలుసుకోకుండా జరిగిన ఘటనను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం భావ్యం కాదని టీటీడీ పేర్కొంది.






