- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి గొడుగుల ఊరేగింపులో కానుకలు ఇవ్వకండి: భక్తులకు టీటీడీ కీలక సూచన
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది..

దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Srivari Salakatla Brahmotsavam) ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ వరకు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు టీటీడీ(TTD) అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు సాయంత్రం స్వామి వారు ఒక్కో రోజు ఒక్కో వాహనంపై విహరించనున్నారు. ఈ నెల 27న శ్రీవారికి గరుడసేవ నిర్వహించనున్నారు. ఈ సేవలో శ్రీవారిని అలంకరించేందుకు గొడుగులు చెన్నై నుంచి తిరుమలకు చేరుకోనున్నాయి. ఈ మేరకు గొడుగులను ఊరేగింపుగా తీసుకురానున్నారు.
అయితే ఈ ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేసింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో కానుకలు ఇవ్వొద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.






