- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల వెళ్తున్నారా..?.. సరికొత్త విధానం అమల్లోకి వచ్చింది తెలుసా.. ?
భక్తుల దర్శనాలపై ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు టీటీడీ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది...

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) కొండకు భక్తులు వెళ్తున్నారు.. శ్రీవారి(Srivaru)ని దర్శించుకుంటున్నారు. అనంతరం తిరిగి వెళ్లిపోతున్నారు. అయితే కింది స్థాయి వరకూ ఏం జరుగుతుందో అధికారులు తెలియడం లేదు. కొందరు చాలా సులువుగా స్వామి వారిని దర్శించుంటున్నారు. మరికొందరు అష్టకష్టాలు పడి స్వామివారిని కనులారా వీక్షించి తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అయితే తిరుమల కొండకు చేరుకున్నప్పటి నుంచి అక్కడ బస చేయడం, దర్శనం టికెట్ల, కల్యాణ కట్ట, భోజనం, అన్న ప్రసాదం, కాలిన నడక మార్గం, క్యూలైన్‌లో ఎదుర్కొంటున్న సమస్యలు, భక్తుల అభిప్రాయాలు తెలుసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) నిర్ణయించింది. ఈ మేరకు కొత్త srవిధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. వాట్సాప్ ద్వారా ఫీడ్ బ్యాక్(Feedback) తెలుసుకునేందుకు శ్రీకారం చుట్టింది. తిరుపతి, తిరుమలలో క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేశారు. మొబైల్‌తో స్కాన్ చేసి అభిప్రాయాలు తెలిపే అవకాశాన్ని భక్తులకు కల్పించింది.
దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో తిరుమలపై అభిప్రాయం తెలిపే అవకాశం లేదని, కొండపై పడుతున్న ఇబ్బందులు తెలిపే అవకాశం లేక.. ఏడుకొండలవాడి దర్శనానంతరం నిరాశతో తిరిగి వెళ్లిపోయేవాళ్లమని, ఇప్పుడు తీసుకొచ్చిన ఫీడ్ బ్యాక్ విధానం బాగుందని చెబుతున్నారు. ఈ విధానం ద్వారా తిరుమలలో ఏం జరుగుతుందో తెలుస్తుందని, తద్వారా భక్తులకు అందించే సేవను మెరుగుపర్చుకోవచ్చని అంటున్నారు. టీటీడీ తీసుకొచ్చిన ఫీడ్ బ్యాక్ విధానానికి తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నామని పలువురు భక్తులు పేర్కొన్నారు.






