ఆ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు: భక్తులకు టీటీడీ కీలక సూచన

by Vemula.Srinu Prasad |

ఆ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దని భక్తులకు టీటీడీ కీలక సూచన చేశారు..

ఆ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు: భక్తులకు టీటీడీ కీలక సూచన
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) వస్తుంటారు. స్వామివారిని దర్శించుకుని కొత్త కొర్కేలు కోరుకుని పాత మొక్కులు తీర్చుకుంటారు. అనంతరం విరాళాలు, కానుకులు ఇస్తుంటారు. నగదు, చెక్కులు, బంగారం, వెండి రూపంలో విరాళాలు అందజేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో విరాళాల విషయంలో భక్తులను కొన్ని సంస్థలు తప్పుదారి పట్టిస్తున్నాయి. దీంతో టీటీడీ కీలక ప్రకటన విడుదల చేసింది. భక్తులు ఇతర సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. టీటీడీకి చెందిన సంస్థలు, శ్రీవారి హుండీకి విరాళాలు అందించాలని సూచించింది.

Global Hindu Heritage Foundation, savetemples.org పేర్లతో వ్యవహరిస్తున్న కొందరు వ్యక్తులు తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు నవంబర్ 29న ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ మోసపూరిత చర్యలతో విరాళాలు సేకరించేందుకు భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారని, తమ దృష్టికి వచ్చిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ విధమైన అనుమానాస్పద సంస్థలకు విరాళాలు ఇవ్వకుండా, వారి వలలో పడకుండా భక్తులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుమల పవిత్రతను కాపాడేందుకు, భక్తుల విశ్వాసం నిలబెట్టేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.

Next Story