ఒంటిమిట్టలో తిరుమల తరహా సేవలు.. టీటీడీ కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం అభివృద్ధిపై టీటీడీ ఫోకస్ పెట్టింది...

ఒంటిమిట్టలో తిరుమల తరహా సేవలు..  టీటీడీ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం(Ontimitta Kodandarama Swamy Temple) అభివృద్ధిపై టీటీడీ(TTD) ఫోకస్ పెట్టింది. భక్తులకు పూర్తి స్థాయిలో అన్నప్రసాదాలు(Annaprasadas) అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఈవో జె. శ్యామలరావు(EO J. Shyamala Rao) ఆదేశించారు. జేఈవో వి. వీరబ్రహ్మంతో కలిసి టీటీడీ పరిపాలనా భవనంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామల రావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆదేశాలతో తిరుమల తరహాలో ఒంటిమిట్ట భక్తులకూ అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు నుంచి అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని, ఇందుకోసం ఆలయం వద్ద తాత్కాలికంగా జర్మన్ షెడ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. అన్నప్రసాదాల వితరణకు అవసరమైన మౌళిక సదుపాయాలు, వంట సామాగ్రి, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.

Next Story