Tirumala: త్వరలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-21 11:10:35  IST  )

తిరుమలలో భద్రతపై టీటీడీ ఫోకస్ పెట్టింది

Tirumala: త్వరలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో భద్రతపై టీటీడీ(TTD) ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఘాట్ రోడ్లలోనూ తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రమాదాల నివారణ, వాహనాల భద్రతపై చర్యలు చేపట్టేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ మేరకు పోలీసులకు 20 బ్రీత్ ఎనలైజర్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్(TTD EO Anil Kumar Singhal) అందజేశారు. టీటీడీ పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భక్తుల భద్రతను అధిక ప్రాధాన్యతమిస్తున్నామని తెలిపారు. ఘాట్ రోడ్లలో పటిష్ట భద్రత కోసం రూ.8 లక్షల విలువైన బ్రీత్ ఎనలైజర్లను పోలీసు యంత్రానికి అంజేసినట్లు పేర్కొన్నారు. భక్తుల భద్రతకు అత్యాధునికి పరికాలను సైతం అందిస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు.


కాగా ఇటీవల కాలంలో అరిపిరి, తిరుమలలో మద్యం, నాన్ వెజ్ కలకలం రేపాయి. శ్రీవారం ఆలయం సమీపంలో భక్తులు ఎగ్ బిర్యానీ తిన్నారు. అలాగే కొందరు యువకులు మద్యం మద్యం మత్తులో హల్ చల్ చేశారు. దీంతో తిరుమలలో భద్రతపై విమర్శలు కురిశాయి. ఈ మేరకు అలిపిరి రోడ్డు మార్గంతో పాటు తిరుమలలోనూ పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా పోలీస్ యంత్రానికి ఈవో అనిల్ కుమార్ 20 బ్రీత్ ఎనలైజర్లను అందజేశారు.

Next Story