తిరుమలలో ప్రణాళిక ప్రకారం వైకుంఠ ద్వార దర్శనాలు : ఈఓ అనిల్ కుమార్ సింఘాల్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-30 01:01:10  IST  )

తిరుమలలో ప్రణాళిక ప్రకారం శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

తిరుమలలో ప్రణాళిక ప్రకారం వైకుంఠ ద్వార దర్శనాలు : ఈఓ అనిల్ కుమార్ సింఘాల్
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ ఇలవైకుంఠమైన తిరుమలలో ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమవ్వగా.. ప్రముఖులు శ్రీవారి సేవలో తరించారు. స్వామివారి భక్తులకు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. అర్థరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరచుకున్నట్లు చెప్పారు. 1.20 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని వెల్లడించారు. టోకెన్లు ఉన్న భక్తులకు జనవరి 1 వరకూ దర్శనాలు ఉంటాయని, టోకెన్లు లేని భక్తులు జనవరి 2న రావాలని సూచించారు.

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. ఉత్తర ద్వార దర్శనాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. కట్టుదిట్టంగా ఉత్తర ద్వార దర్శనాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్న పానీయాలకు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

Next Story