తిరుమల వైకుంఠ ద్వారదర్శనం.. టీటీడీ ఈఓ కీలక ప్రకటన

by Naga Rani Yarlagadda |

ప్రతీ ఏడాది వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారదర్శనం కల్పిస్తోంది టీటీడీ.

తిరుమల వైకుంఠ ద్వారదర్శనం.. టీటీడీ ఈఓ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ ఏడాది వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారదర్శనం కల్పిస్తోంది టీటీడీ. ఈ ఏడాది వైకుంఠ ద్వారదర్శనంపై ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కీలక ప్రకటన చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకూ శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వారదర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆఫ్ లైన్, ఆన్ లైన్ టోకెన్ల జారీ విధి విధానాలను త్వరలో తెలియజేస్తామన్నారు.

నవంబర్ 17 నుంచి బ్రహ్మోత్సవాలు

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. స్వామివారి భక్తుల విజ్ఞప్తి మేరకు అంగప్రదక్షిణ టోకెన్ల జారీని డిప్ విధానం నుంచి మార్చినట్లు తెలిపారు. ముందుగా వచ్చినవారికి ముందు ప్రాతిపదికన 2026 ఫిబ్రవరి నుంచి ఆన్ లైన్ కోటా విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇక రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో రూ.750 కోట్ల శ్రీవాణి ట్రస్టు నిధులతో 5 వేల భజన మందిరాలను నిర్మిస్తామని తెలిపారు.

Next Story