పాము కాటుకు గురైన టీటీడీ ఉద్యోగి.. ఆస్పత్రికి తరలింపు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-29 03:25:25  IST  )

తిరుమల(Tirumala)లో టీటీడీ ఉద్యోగిని పాము కాటేసింది.

పాము కాటుకు గురైన టీటీడీ ఉద్యోగి.. ఆస్పత్రికి తరలింపు
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala)లో టీటీడీ ఉద్యోగిని పాము కాటేసింది. టీటీడీ అటవీ శాఖ(Forest Department) ఒప్పంద ఉద్యోగి భాస్కరనాయుడు(68) మరోసారి విషనాగు కాటుకు గురయ్యారు. తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద పెద్ద నాగుపాము ఉన్నట్లు స్థానికులు అతనికి తెలిపారు. దీంతో అక్కడకు చేరుకున్న భాస్కరనాయుడు పామును పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పాము అతడిని కాటేసింది.

ఈ ఘటనను గమనించిన టీటీడీ(TTD) ఉద్యోగులు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో భాస్కరనాయుడుకు టీటీడీ అశ్విని ఆసుప్రతిలోని అపోలో అత్యవసర క్లినిక్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కరకంబాలోని అమరా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story