Uttar Pradesh:కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-30 10:32:32  IST  )

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళ కోలాహలంగా సాగుతోంది.

Uttar Pradesh:కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం
X

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళ కోలాహలంగా సాగుతోంది. ఈ మహా కుంభమేళా(Mahakumbamela)కు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో.. యోగులు, స్వాములు, సాధువులు, అఘోరా(Aghora)లు వస్తున్నారు. ఈ క్రమంలో త్రివేణి(Triveni) సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇటీవల కుంభమేళాలో తొక్కిసలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలు అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌(Prayag Raj)లో జరుగుతున్న మహా కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి(TTD Employee) హాజరయ్యారు. ఈ క్రమంలో టీటీడీ ఉద్యోగి అదృశ్యమయ్యారు.

టీటీడీ(TTD) ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేసిన నమూనా ఆలయంలో విధులు నిర్వహించేందుకు వెళ్లిన దీవేటి సుబ్రహ్మణ్యం(Subramanyam) అనే వ్యక్తి నిన్న (బుధవారం) సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. ఆయన ఆచూకీ కోసం స్థానిక పోలీసులు టీటీడీ అధికారులు(TTD Officers) ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) ఉద్యోగి అదృశ్యం పై పూర్తి సమాచారం అందించాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి(Venkaiah Chowdary) అధికారులను ఆదేశించారు. శ్రీవారి నమూనా ఆలయంలో పనిచేసేందుకు సుమారు 200 మంది టీటీడీ ఉద్యోగులు వెళ్లారు. ఈ క్రమంలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం పై విచారణ కొనసాగుతుంది. మహాకుంభమేళాకు ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతున్న విషయం తెలిసిందే.

Next Story