TTD Chairman: దయచేసి అలా చేయకండి.. టీటీడీ చైర్మన్ కీలక అభ్యర్థన

by Kema Shiva Kumar |

తిరుపతి (Tirupati)లో వైకుంఠ ద్వార దర్శన (Vaikunta Dwara Darshanam) టికెట్ల జారీ కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

TTD Chairman: దయచేసి అలా చేయకండి.. టీటీడీ చైర్మన్ కీలక అభ్యర్థన
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి (Tirupati)లో వైకుంఠ ద్వార దర్శన (Vaikunta Dwara Darshanam) టికెట్ల జారీ కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 59 మందికి గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఇవాళ తిరుమల (Tirumala)లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. ఈనెల 8న జరిగిన తొక్కిసలాట చాలా బాధకరమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలో పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా తనపై సోషల్ మీడియా (Social Media)లో కొందరు ఫేక్ న్యూస్ (Fake News) రాస్తున్నారని ఆరోపించారు. తిరుమల (Tirumala)కు సంబంధించి తనపై నిరాధార వార్తలు రాయవద్దని రిక్వెస్ట్ చేశారు. తొక్కిసలాట ఘటనలో గాయపడిన 31 మందికి చెక్కులు అందజేశామని మిగతా 28 మందికి కూడా మంగళవారం లోపు పంపిణీ చేస్తామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.

Next Story