- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TTD: తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
by Ramesh Naini |
తిరుమలలోని శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు మంగళవారం సాయంత్రం బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, నరేష్, శాంతా రామ్, జానకి దేవిలతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమలలోని శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు మంగళవారం సాయంత్రం బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, నరేష్, శాంతా రామ్, జానకి దేవిలతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి చేసుకుని వెలుపలకు వచ్చిన భక్తులతో మాట్లాడి టీటీడీ కల్పించిన సౌకర్యాలు, సదుపాయాలపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా శ్రీవారి దర్శనం బ్రహ్మాండంగా జరిగిందని, టీటీడీ చేసిన ఏర్పాట్లు, అలంకరణలు అద్భుతంగా ఉన్నాయని చైర్మన్ వద్ద భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అన్న ప్రసాదాలు, పాలు, తాగునీరు నిరంతరాయంగా అందుతున్నాయని చైర్మన్ కు తెలిపారు. అనంతరం నాది నీరాజనం వేదికపై కళాకారుల నృత్య ప్రదర్శనలు, ఆలయం ముందు శ్రీరంగనాథ స్వామి ఆలయ సెట్టింగును తిలకించారు.
Next Story






