TTD Chairman : తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

by Y. Venkata Narasimha Reddy |

టీటీడీ చైర్మన్(TTD Chairman) బీ.ఆర్.నాయుడు(B.R. Naidu) తిరుమలలోని లడ్డూ బూందీ పోటు, పరకామణి భవనంలో శనివారం ఆకస్మిక తనిఖీ(Surprise Inspections)లు నిర్వహించారు.

TTD Chairman : తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
X

దిశ, వెబ్ డెస్క్ : టీటీడీ చైర్మన్(TTD Chairman) బీ.ఆర్.నాయుడు(B.R. Naidu) తిరుమలలోని లడ్డూ బూందీ పోటు, పరకామణి భవనంలో శనివారం ఆకస్మిక తనిఖీ(Surprise Inspections)లు నిర్వహించారు. ముందుగా పరకామణి భవనాన్ని పరిశీలించిన ఆయన నాణేలు, నోట్లు, బంగారు, వెండి, ఇతర కానుకల విభజన ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హుండీ లెక్కింపులో పాల్గొనే సిబ్బందిని ఏవిధంగా తనిఖీ చేస్తారని ఆరా తీశారు. పరకామణి భవనంలో సీసీ టీవీ నిఘా, భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బూందీపోటుకు చేరుకున్న చైర్మన్ బూందీ తయారీ, నెయ్యి టిన్ లు, పిండి మిక్సింగ్, కన్వేయర్ బెల్ట్ ద్వారా ముడి పదార్థాలను ఆలయంలోకి తరలించే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోటు సిబ్బందితో మాట్లాడుతూ విధి నిర్వహణలో పరిశుభ్రంగా భక్తిభావంతో ఉండాలని సూచించారు. పోటులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తతో ఉండాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసి పలువురు భక్తులతో మాట్లాడారు. లడ్డూ బరువును లడ్డూ కేంద్రంలో తూకం వేసి పరిశీలించారు. ఈ సందర్భంగా లడ్డూ కేంద్రంలో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని ఆలయంలోని లడ్డూ పోటును పరిశీలించారు. అక్కడ లడ్డూ తయారు చేసే విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎన్ని లడ్డూలు , ఏయే అన్నప్రసాదాలు తయారు చేస్తారని అధికారులను ఆరా తీశారు. ప్రసాదాల తయారీ విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని ఇలాగే కొనసాగించాలని అధికారులకు సూచించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను బీ.ఆర్.నాయుడు ఆదేశించారు.

కొన్ని నెలల క్రితం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వివాదం నేపథ్యంలో టీటీడీ లడ్డూ తయారీపై తరుచు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంది. మరోవైపు వైసీపీ హయాంలో లడ్డూ కల్తీపై విచారణ కమిషన్ విచారణను కొనసాగిస్తోంది.

Next Story