శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆ ఏడు రోజులు టోకెన్లు లేకుండానే దర్శనం

by Gantepaka Srikanth |

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆ ఏడు రోజులు టోకెన్లు లేకుండానే దర్శనం

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆ ఏడు రోజులు టోకెన్లు లేకుండానే దర్శనం
X

దిశ, వెబ్‌డెస్క్: వైకుంఠద్వార దర్శనాలకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) తెలిపారు. సోమవారం ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు జరుగనున్నాయని స్పష్టం చేశారు. మొదటి మూడు రోజులకు ఎలక్ట్రానిక్ లక్కీడిప్ ద్వారా టోకెన్లు కేటాయించాం. మిగతా 7 రోజులు టోకెన్లు లేకుండానే సామాన్య భక్తులకు సర్వదర్శనం ద్వారా వైకుంఠద్వార దర్శనం కల్పిస్తామని తెలిపారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. రద్దీ ప్రాంతాల్లో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్నారు. మంగళవారం 50 అజెండా అంశాలతో టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. దాత మంతెన రామలింగరాజు సహకారంతో పీఏసీలను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఇటీవల రూ.9 కోట్ల విరాళం అందింది. ఆలయ ధ్వజస్తంభాల కోసం 100 ఎకరాల్లో దివ్యవృక్షాల పెంపకానికి ప్రణాళిక రూపొందించాం. పలమనేరులోని టీటీడీ గోశాల ప్రాంగణాన్ని ఇందుకు అనువైన స్థలంగా గుర్తించాం. ఈ ప్రాజెక్టుపై రేపటి పాలకమండలి సమావేశంలో నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. భక్తుల అవసరాలకు సరిపడా బ్లేడులను ప్రముఖ తయారీ సంస్థ 17వ తేదీన విరాళంగా అందజేయనుందని అన్నారు.

Next Story