బిహార్‌లో టీటీడీకి 10. 11 ఎకరాల భూమి.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఛైర్మన్ బీఆర్ నాయుడు

by Malleboina Mahesh |   (  Updated:2025-12-06 14:30:57  IST  )

ఎంతో ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు బిహార్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

బిహార్‌లో టీటీడీకి 10. 11 ఎకరాల భూమి.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఛైర్మన్ బీఆర్ నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఎంతో ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) బిహార్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేస్తూ.."బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో టీటీడీ ఆలయ నిర్మాణానికి (TTD temple construction) బిహార్ ప్రభుత్వం అంగీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. మోకామా ఖాస్ ప్రాంతంలో 10.11 ఎకరాల భూమిని 99 సంవత్సరాలపాటు రూ.1 టోకెన్ లీజ్ రెంట్‌పై కేటాయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ నిర్ణయంపై అభినందనలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర హెచ్‌ఆర్డీ మంత్రి నారా లోకేశ్‌కి కృతజ్ఞతలు. అలాగే బిహార్ పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్‌ను ఎంవోయూ కోసం అధికారికంగా నియమించినందుకు ధన్యవాదాలు. టీటీడీ ప్రతినిధులు త్వరలోనే సంప్రదింపులు ప్రారంభించి, ఆలయ నిర్మాణానికి సంబంధించిన తదుపరి చర్యలు చేపడతారు. బిహార్ ప్రభుత్వ (Bihar Govt) సహకారం, దూరదృష్టికి హృదయపూర్వక కృతజ్ఞతలు." అంటూ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు.

Next Story