- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నువ్వు హిందువైతే భార్యతో తిరుమలకు రా: జగన్‌కు బీఆర్ నాయుడు సవాల్
తమరు హిందువే అయితే భార్యతో కలిసి తిరుమలకు రావాలని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సవాల్ విసిరారు. బీఆర్ నాయుడిని ఉద్దేశించి జగన్ చేసిన ట్వీట్‌కు ఆయన స్ట్రాంగ్ ఇచ్చారు...

దిశ, వెబ్ డెస్క్: తమరు హిందువే అయితే భార్యతో కలిసి తిరుమలకు రావాలని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy)కి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(Ttd Chairman Br Naidu) సవాల్ విసిరారు. బీఆర్ నాయుడిని ఉద్దేశించి జగన్ చేసిన ట్వీట్‌కు ఆయన స్ట్రాంగ్ ఇచ్చారు. జగన్ సతీ సమేతంగా తిరుమల(Tirumala)కు రాలేరని, ఆయన్ను ఎవ్వరూ నమ్మరని ఎక్స్ వేదికగా బీఆర్ నాయుడు సైతం ట్వీట్ చేశారు. జగన్ క్రిస్టియన్ అని జగమెరిగిన సత్యమని, హిందుత్వంపై మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. దేవదేవుడు వేంకటేశ్వర స్వామిపై ఎలాపడితే అలా మాట్లాడతావా అంటూ బీఆర్ నాయుడు ఫైర్ అయ్యారు. శ్రీవారి పేరు ఉచ్ఛరించే అర్హత, నైతికత నీకుందా జగన్ అని బీఆర్ నాయుడు నిలదీశారు.
సీఎంగా ఉన్నావనే కదా..
‘‘హిందూ వ్యతిరేకి అయిన నువ్వు అప్పుడు సీఎంగా ఉన్నావనే కదా నీ అనుచరులకి ధైర్యం. అందుకే వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి రెచ్చిపోయి హిందూ మత ఔన్నత్యాన్ని మంటగలిపారు. ఒక పథకం ప్రకారం తిరుమల కొండపై యథేచ్ఛగా అన్యమత ప్రచారం చేశారు. అన్యమతస్తుడవైన నువ్వు ఇప్పటివరకు దేవదేవునిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు?. సీఎంగా ఉండగా నీ భార్యతో కలిసి గుడికి వచ్చి పట్టు వస్త్రాలిచ్చావా?. రాలేదే. మీ జీవితంలో భార్యతో కలిసి తిరుమలకు రాలేవు. ఎందుకంటే మీ ఇద్దరూ నమ్మేది ఏసుప్రభువునే.. వేంకటేశ్వర స్వామిని కాదు. ఇది ఒప్పుకో జగన్.... నేను ఛైర్మన్ అయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు టీటీడీని ప్రక్షాళన చేస్తున్నాం. నీ అండతో నీ బాబాయ్, భూమన చేసిన అవినీతి, అక్రమాలు బయట పడుతున్నాయి. టీటీడీలో అన్యమతస్తులు ఉండరాదని నేను నిర్ణయం తీసుకున్న నాడే నాపై పథకం ప్రకారం కుట్రలు ప్రారంభించావు. అందులో భాగంగానే కదా నాపై డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి తిరుమల ప్రతిష్ట దెబ్బతీయాలని చూశావు. వేంకటేశ్వర స్వామిని ఇంటిదైవంగా పూజించే చంద్రబాబుకి దేవదేవునిపై భక్తి లేదంటావా?. చంద్రబాబు భార్య తో తిరుమలకు వస్తారు. నువ్వు హిందూ వే అయితే భార్యతో తిరుమలకు రా.’’ బీఆర్ నాయుడు సవాల్ విసిరారు.






