టీటీడీ చైర్మన్‌ BR నాయుడికి షాక్.. అలిపిరి పీఎస్‌లో అందిన ఫిర్యాదు

by Kema Shiva Kumar |

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయరాదంటూ ఇప్పటికే టీటీడీ (TTD) ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

టీటీడీ చైర్మన్‌ BR నాయుడికి షాక్.. అలిపిరి పీఎస్‌లో అందిన ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయరాదంటూ ఇప్పటికే టీటీడీ (TTD) ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ నిబంధనలు అతీక్రమిస్తే.. ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల విష్ణుమూర్తి విగ్రహాన్ని రోడ్డుపై పడేసిన వివాదంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల వేదికగా రాజకీయపరమైన అనుచిన ఆరోపణలు చేశారని వైసీపీ యువజన విభాగం నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ఇవాళ వారు చైర్మన్ బీఆర్ నాయుడిపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అలిపిరి పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు.

Next Story