"మీ ఇద్దరికీ చుక్కలు చూపిస్తా.." రాసలీలల వీడియోలపై బీఆర్ నాయుడు ఫైర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-01 08:22:33  IST  )

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన రాసలీలల వీడియోలపై బీఆర్ నాయుడు స్పందించారు. ఇదంతా వైసీపీ పన్నిన కుట్రగా ఆరోపించారు.

మీ ఇద్దరికీ చుక్కలు చూపిస్తా.. రాసలీలల వీడియోలపై బీఆర్ నాయుడు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తనపై వస్తున్న రాసలీలల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం వల్లే తాను ఇంతవరకూ దీనిపై స్పందించలేదన్నారు. దేవుడే చూసుకుంటాడు, ఓపికగా ఉండాలని చెప్పడంతోనే సైలెంట్ గా ఉన్నట్లు చెప్పారు. టీటీడీ ప్రతిష్టను, తన పరువును దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఆరోపించారు.

ఎవరైతే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారో.. ఆ వీడియోలో ఉన్న వ్యక్తికి తమ ఫ్యామిలీకి మధ్య 30 ఏళ్ల అనుబంధం ఉందని, ఒకరి ఇళ్లకు ఒకరం వెళ్లి వస్తుంటామని తెలిపారు. కానీ.. అదే అదనుగా భావించి వీడియోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చీప్ పాలిటిక్స్ తనపై వాడితే భయపడే వ్యక్తిని కానన్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశామని, ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడేది లేదని స్పష్టం చేశారు.

గతంలో జగన్ మోహన్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేటపుడు సతీసమేతంగా ఎందుకు రాలేదని ప్రశ్నించానని, భారతి పేరు తీసుకురావడంతో వారంతా తనపై ప్రతీకారం తీర్చుకోవాలని బురదజల్లుతున్నారని విమర్శించారు. ఈ వీడియోలపై ఇద్దరి ఫ్యామిలీల్లో వాళ్లు ఎవరూ కంప్లైంట్స్ చేయలేదన్నారు. కొన్ని ఫొటోలైతే 20-25 ఏళ్ల క్రితం దిగినవని, వాటిని మార్ఫింగ్ చేసేందుకు సిగ్గులేదా అని ఫైరయ్యారు. ఈ విషయంపై లీగల్ గా ఫైట్ చేస్తానని బీఆర్ నాయుడు తెలిపారు. ఎవరో వచ్చి టీటీడీ బోర్డు చైర్మన్ గా తప్పుకోమంటే తప్పుకునే ప్రసక్తే లేదన్నారు.

ఇక టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో వాళ్లేమి పనులు చేశారో అంతా తనకు తెలుసని, తలచుకుంటే అన్నీ బయటపెట్టగలనన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున వ్యాపారం చేసే తాను ఎవ్వరికీ భయపడే అవసరం లేదన్నారు. గతపాలకులకు సంబంధించి ఏ ఫైల్ ఓపెన్ చేసినా అన్నీ దొంగలెక్కలే కనిపిస్తాయన్నారు. తన వద్ద కూడా సీనియర్ జర్నలిస్టులు పనిచేస్తున్నారని, అందరి బాగోతాలు కూపీ లాగుతామన్నారు.

BR Naidu: సోషల్ మీడియాలో టీటీడీ చైర్మన్ వీడియో వైరల్.. స్పందించిన బీఆర్ నాయుడు

Next Story