- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: ఘోర ఓటమి.. ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన రాజీనామాల పర్వం
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డ్ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీలోనే ఇంతవరకు ఏ పార్టీ సాధించని

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డ్ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీలోనే ఇంతవరకు ఏ పార్టీ సాధించని ఘన విజయం సాధించి.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సారి వై నాట్ 175 అంటూ ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీ కదనరంగంలో చితకిలపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఇంత వరకు ఏ పార్టీ ఓడని విధంగా ఓటమి చవి చూసింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ కేవలం 9 సీట్లుకే పరిమితమై ఊహించని ఓటమిని మూటగట్టుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో జగన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే మరికొందరు వైసీపీ నేతలు సీఎం జగన్ బాటలో నడుస్తుతున్నారు. ఇప్పటికే జగన్ రిజైన్ లెటర్‌ను గవర్నర్‌కు పంపగా.. తాజాగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్‌గా విజయబాబు సైతం రిజైన్ చేశారు. వీరి రాజీనామా లేఖలను సంబంధించి అధికారులకు పంపించారు. వైసీపీ ఓటమితో మరికొందరు నేతలు సైతం వీరిని ఫాలో కానున్నట్లు సమాచారం.






