TTD:ముగిసిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం.. చర్చించిన అంశాలివే!

by Jakkula.Mamatha |

తిరుమలలో ఇవాళ(మంగళవారం) నిర్వహించిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది

TTD:ముగిసిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం.. చర్చించిన అంశాలివే!
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమలలో ఇవాళ(మంగళవారం) నిర్వహించిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో భక్తుల(Devotees) సౌకర్యాలే లక్ష్యంగా ఈరోజు(మంగళవారం) టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) అధ్యక్షతన స్థానిక అన్నమయ భవన్‌లో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఈవో శ్యామలరావు, బోర్డు సభ్యులు హాజరయ్యారు.

తిరుమలలోని ప్రైవేటు హోటల్లో భక్తులకు నాణ్యమైన భోజనం అందించడం లక్ష్యంగా పేరొందిన బ్రాండెడ్ హోటళ్లను అనుమతించాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీటి విధి విధానాలు నిర్ణయించడం టెండర్లు ఆహ్వానించే అంశం పై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ధర్మకర్తల మండలిలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు(EO Shyamala Rao) వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. ఇవాళ జరిగిన ధర్మకర్తల మండలిలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాము. తిరుమల కొండపై పచ్చదనం పెంపునకు టీటీడీ చర్యలు మొదలు పెట్టిందని పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు టీటీడీ రూ.4 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు ఈవో తెలిపారు. స్విమ్స్ ఆసుపత్రిలో 597 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ఒంటిమిట్ట ఆలయంలో నిత్య అన్నదానం చేయాలని నిర్ణయించారు.

తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ వాడుకోవాలని నిర్ణయించినట్లు ఈవో తెలిపారు. టీటీడీ ఉప ఆలయాలు సమగ్ర అభివృద్ధికి కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆకాశగంగ, పాపవినాశం, కాలినడక మార్గాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. తిరుమలలో 42 వీఐపీ అతిథి గృహాలు ఆధ్యాత్మిక పేర్లు మార్చాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో శ్యామల రావు పేర్కొన్నారు.

Next Story