- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీటీడీపై షర్మిల వ్యాఖ్యలు.. ఆమెకు రాష్ట్రంలో ఉండే హక్కు లేదన్న భానుప్రకాష్
టీటీడీ నిధులతో రాష్ట్రంలోని దళితవాడల్లో 5 వేల ఆలయాలను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: టీటీడీ నిధులతో రాష్ట్రంలోని దళితవాడల్లో 5 వేల ఆలయాలను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పూర్తిగా ఆర్ఎస్ఎస్ వాదిలా మారిపోయారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. దళితవాడల్లో గుడులు నిర్మించమని ఎవరు అడిగారు ? టీటీడీ వద్ద నిధులు అంత ఎక్కువగా ఉంటే వాటిని దళితవాడల అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు. మహిళా సంక్షేమ హాస్టళ్లలో ఉన్న మౌలిక వసతుల కొరతలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. దళితవాడల్లో ఆలయాలు కడితే.. దళితుల్ని పూజారులుగా నియమిస్తారా లేక దళితులకే అవకాశం ఇస్తారా? సీఎం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీ నిధులతో 5 వేల ఆలయాల నిర్మాణంపై షర్మిల చేసిన వ్యాఖ్యల్ని టీటీడీ సభ్యుడైన భాను ప్రకాష్ తప్పుపట్టారు.
షర్మిల చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన ఆయన.. రాష్ట్రంలో ఆలయాల నిర్మాణాన్ని వ్యతిరేకించడం దారుణమన్నారు. షర్మిల కుటుంబం హిందూధర్మ వినాశనానికి పనిచేస్తోందని ఆరోపించారు. తిరుమల గురించి తెలియనివారికి మాట్లాడే హక్కు లేదన్నారు. అసలు షర్మిలకు ఇక్కడ ఉండే అర్హత లేదని, ఆమె జెరూసలేం వెళ్లాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.






