- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TTD: టీటీడీ ఉద్యోగులకు బిగ్ షాక్.. అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు
టీటీడీ (TTD) ఉద్యోగులకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Additional EO Venkaiah Chowdary) బిగ్ షాకిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: టీటీడీ (TTD) ఉద్యోగులకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Additional EO Venkaiah Chowdary) బిగ్ షాకిచ్చారు. ఈ మేరకు ఇవాళ తెల్లవారుజామున ఆయన ఆలయ పరిధిలోని లడ్డూ కౌంటర్ల (Laddu Counters)లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా భక్తులకు దర్శనం కోసం ఇచ్చే టోకెన్ల స్కానింగ్, లడ్డూల పంపిణీ ప్రక్రియను స్వయంగా తిలకించారు. అనంతరం లడ్డూ ప్రసాదం కోసం క్యూ లైన్ (Que Lines)లో ఉన్న భక్తులతో మాట్లాడి వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం (Laddu Prasadam) రుచి, నాణ్యత బాగా పెరిగిందంటూ భక్తులు సంతోషం వ్యక్తం చేసినట్లుగా ఆయన తెలిపారు.
కాగా, ఇటీవల టీటీడీ ఈవో శ్యామల రావు (EO Shyamala Rao), అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి (Venkaiah Chowdary) తిరుమలలో భక్తుల క్యూ లైన్లు, లడ్డూ కౌంటర్లు, లడ్డూ పోటు విభాగాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపడుతున్న సంగతి విదితమే. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkaiah Chowdary) మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఏమైనా సమస్యలుంటే తన కార్యాలయానికి వచ్చి నేరుగా ఫిర్యాదు చేయాలని అన్నారు. ఒక సమస్య జఠిలం అయితే.. అక్కడికక్కడే క్లియర్ చేస్తామని పేర్కొన్నారు.






