- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆణివార ఆస్థానం.. ఆ రెండ్రోజులు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో ఈ ఏడాది ఆణివార ఆస్థానం ఉత్సవం జూలై 16న జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని, జూలై 15న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో ఈ ఏడాది ఆణివార ఆస్థానం ఉత్సవం జూలై 16న జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని, జూలై 15న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. ఈ నేపథ్యంలో జూలై 15, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్లు తెలుపుతూ.. ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు రోజుల్లో ప్రోటోకాల్ విఐపీలకు మినహా ఇతరుల నుండి ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. భక్తులు ముందుగానే ఈ విషయాన్ని తెలుసుకొని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జూలై 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం ఘనంగా జరగనుంది. ప్రతి ఆషాఢ మాసంలో ఆలయంలో జరిగే ఈ ఉత్సవానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
జూలై 6: ఉదయం స్వామివారి సుప్రభాతంతో ప్రారంభమై శతకలశ స్నపనం, మహాశాంతి హోమం, కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
జూలై 7: సంప్రదాయబద్ధంగా ఆలయ కైంకర్యాలు పూర్తయిన తర్వాత శాత్తుమొరాయి, ఆస్థానం నిర్వహించి, సాయంత్రం స్వామివారు నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
జూలై 8: చివరి రోజున తిరుమంజనం, కవచ ప్రతిష్ఠ, సాయంత్రం కవచ సమర్పణ అనంతరం మళ్లీ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు ఉంటుంది.
నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలు
అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో జూలై 5 నుంచి 13 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. జూలై 5న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం జరిపారు. ఈ ఆలయం చోళవంశరాజు కుళోత్తుంగ చోళునిచే 11వ శతాబ్దంలో ప్రారంభించబడింది. అనంతరం కాకతీయ, విజయనగర, మట్టిరాజుల కాలంలో ఇది అభివృద్ధి చెందింది. ప్రసిద్ధ కవి తాళ్ళపాక అన్నమాచార్యులు ఈ ఆలయాన్ని దర్శించి శతాధిక కీర్తనలు రచించినట్లు ప్రచారం ఉంది. దీపాలు లేకపోయినా ఆలయం అంతటా ప్రకాశవంతంగా కనిపించడం ఈ ఆలయం ప్రత్యేకత. అదేవిధంగా సంవత్సరంలో ఒక నిర్దిష్ట రోజున సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై నేరుగా పడేలా శిల్పకళాకారులు ఆలయ నిర్మాణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.






