చర్చి ప్రార్థనల్లో పాల్గొన్న టీటీడీ ఏఈవో..సస్పెండ్ చేసిన అధికారులు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-08 14:54:46  IST  )

టీటీడీ ఏఈవో రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా రాజశేఖర్ బాబు వ్యవహరిస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు నివేదిక సమర్పించారు.

చర్చి ప్రార్థనల్లో పాల్గొన్న టీటీడీ ఏఈవో..సస్పెండ్ చేసిన అధికారులు
X

దిశ‌, వెబ్ డెస్క్: టీటీడీ ఏఈవో రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా రాజశేఖర్ బాబు వ్యవహరిస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు నివేదిక సమర్పించారు. ప్రతివారం రాజశేఖర్ బాబు పుత్తూరు చర్చిలో ప్రార్థనలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. నివేదిక ఆధారంగా ఈవో శ్యామలారావు రాజశేఖర్ బాబును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉంటే రాజశేఖర్ బాబు టీటీడీలో ఏఈవోగా పనిచేస్తూ అన్యమత ప్రచారంలో పాల్గొంటున్నాడని, ఆయనను విధుల నుండి తప్పించాలని నీలకంఠం అనే వ్యక్తి టీటీడీకి ఫిర్యాదు చేశాడు. రాజశేఖర్ బాబు పుత్తూరులోని చర్చి కాంపౌండ్‌లో సొంత భవనం కలిగి ఉండి అక్కడ చర్చిలోనే ప్రతి ఆదివారం ప్రార్థనల్లో పాల్గొంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు రాజశేఖర్ బాబు ప్రార్థనల్లో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Next Story