బ్రహ్మోత్సవాల్లో భద్రతపై ఫోకస్.. ఏఈవో కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భద్రతపై టీటీడీ ఏఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు..

బ్రహ్మోత్సవాల్లో భద్రతపై ఫోకస్.. ఏఈవో కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో భక్తులభద్రతపై టీటీడీ దృష్టి పెట్టింది. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులతో తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడుతో కలిసి అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమన్వయ సమావేశం నిర్వహించారు. భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా రోజుకు 435 బస్సులు నడుస్తాయన్నారు. సుమారు 1.60 లక్షల మంది భక్తులకు పికప్, డ్రాప్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాహనాల పార్కింగ్ కోసం తిరుపతిలో 23 ప్రదేశాలను సిద్ధం చేస్తున్నామన్నారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో 1.85 లక్షల నుంచి 2 లక్షల వరకు భక్తులు కూర్చునే సదుపాయం ఉందన్నారు. అలాగే అసౌకర్యం కలగకుండా వాహన సేవలను తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 4200 మంది పోలీసులు, 1500 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా క్రౌడ్ మూవ్‌మెంట్, రద్దీ పాయింట్లను రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తారని చెప్పారు. సీఎంతో పాటు రాజ్యాంగపరమైన అధినేతలు, వీఐపీల రాకపోకలకు ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వెంకయ్య చౌదరి చెప్పారు.

Next Story