- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రంప్ కు సొంతగడ్డపైనే మద్ధతు లేదు : సీపీఐ నారాయణ
ప్రపంచ పౌర సమాజం అమెరికా తీరును ఖండించాలి.

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతిలోని బైరాగిపట్టెడలో భోగిమంట (Bhogi Manta) కార్యక్రమాన్ని సీపీఐ (CPI) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ముఖ్యనేత నారాయణ (Narayana) హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంటా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను ఆయన భోగిమంటల్లో వేసి కాల్చారు. ఈ సందర్భంగా ట్రంప్ ది రాక్షస పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంతగడ్డపైనే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడికి మద్ధతు లేదని మండిపడ్డారు. అమెరికా అరాచకాలను భారత్ ఖండించకపోవడం బాధాకరమన్నారు. వెనిజువెలాపై (Venezuvela) అమెరికా దాడుల విషయంలో మౌనం వహించడం అంటే అందులో భాగస్వామ్యం వహించినట్లేనని అన్నారు. అమెరికా (America) దురాశ కారణంగానే వెనిజువెలా పతనావస్థకు చేరిందని ఆరోపణలు గుప్పించారు. ట్రంప్ తీరును సామ్రాజ్యవాద దోపిడీ చర్యగా నారాయణ అభివర్ణించారు. చమురు, ఖనిజ దోపిడీకి దారి తీసే సామ్రాజ్యవాద జోక్యాలను ప్రతిఒక్కరూ తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ట్రంప్ అరాచకాలపై సీఎం చంద్రబాబు నాయుడు గళం విప్పాలని డిమాండ్ చేశారు.






