- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారులపై తిరగబడ్డ గిరిజనులు.. ఉద్రిక్తత
భూవివాదంలో ఘర్షణ జరగడంతో రెవెన్యూ అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు..

దిశ, వెబ్ డెస్క్: భూవివాదం(land dispute)లో ఘర్షణ జరిగింది. దీంతో ఎమ్మార్వో కళ్లలో కారం చల్లి నిర్బంధించారు. ఈ ఘటన ఏలూరు జిల్లా(Eluru District) బుట్టాయగూడెం మండలం ఇనుమూరు(Inumuru)లో జరిగింది. స్థానికులు సత్యనారాయణ, ఉదయ్ భాస్కర్, ఝూన్సీరాణికు చెందిన సుమారు 80 ఎకరాల భూమికి సంబంధించి ప్రొటెక్షన్ ఆర్డర్‌తో వెళ్లిన రెవెన్యూ, పోలీస్ అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. పంటను దున్నుతున్న ట్రాక్టర్ డ్రైవర్‌పై దాడి చేశారు. అధికారుల వాహనాన్ని ధ్వంసం చేశారు. ముందుకు కదలనివ్వకుండా ఎమ్మార్వోను చుట్టముట్టారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఎమ్మార్వోను విడిపించారు. ఇరువర్గాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి మాట్లాడదామని హామీ ఇవ్వడంతో గిరిజనులు ఆందోళనను విరమించారు. గిరిజనులపై రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. అయితే ముత్యలరావు, వెంటకేశ్ సహా మరో పదిమంది వ్యక్తులు తమపై దాడి చేశారని, ట్రాక్టర్‌ను సైతం ధ్వంసం చేశారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ 80 ఎకరాల పొలంపై తామంతా ఆధార పడి జీవిస్తున్నామని వాపోయారు.






