బుర‌ద రోడ్డులో ప‌డుకొని గిరి పుత్రుడి వినూత్న నిర‌స‌న

by Vemula.Srinu Prasad |

మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం పంచాయతీ పరిధిలో రోడ్ల దుస్థితిపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ...

బుర‌ద రోడ్డులో ప‌డుకొని గిరి పుత్రుడి వినూత్న నిర‌స‌న
X

దిశ, వెబ్ డెస్క్: మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం పంచాయతీ పరిధిలో రోడ్ల దుస్థితిపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్వానంగూడ నుంచి సంజువాయి సెంటర్ వరకు ఉన్న 3 కిలోమీటర్ల రోడ్డు తీవ్రంగా దెబ్బతిని బురదమయంగా మారింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు ప్రమాదకరంగా మారిందని, రోజువారీ అవసరాలకు, అత్యవసర వైద్య సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు వాపోతున్నారు.

వినూత్న రీతిలో నిరసన

అయితే ఓ గిరిజనుడు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రోడ్డుపై ఉన్న గుంతల్లో పడి ఉన్న బురద నీటిలోనే పడుకుని నిరసనను వ్యక్తం చేశాడు. ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మన్యం ప్రాంత ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సొంత మండలంలోనే ఇలా ఉండటంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంత నియోజకవర్గంలో రవాణా కష్టాలను తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Next Story