- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు భోగాపురం ఎయిర్‌పోర్టులో ట్రయల్ రన్..
ఏపీ అభివృద్ధిలో భోగాపురం హరిత అంతర్జాతీయ విమానాశ్రయం గేమ్‌ఛేంజర్ కానుంది. నేడు ట్రయల్‌రన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అభివృద్ధిలో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం గేమ్ ఛేంజర్ గా మారబోతోంది. నేడు ఈ ఎయిర్ పోర్టులో ట్రయల్ రన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక బిజినెస్ ఫ్లైట్ ఎయిర్ పోర్టు రన్ వేపై దిగనున్నట్లు జీఎంఆర్ సంస్థ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకరరావు వెల్లడించారు. ట్రయల్ రన్ ను పర్యవేక్షించేందుకు ఢిల్లీ నుంచి ఎయిరిండియా ఫ్లైట్ లో ఉదయం 10.15 గంటలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర అధికారులు విచ్చేయనున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి వస్తే.. వైజాగ్ సౌత్ ఇండియాలోనే ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
భోగాపురం ఎయిర్ పోర్టు స్పెషాలిటీస్
భోగాపురం ఎయిర్ పోర్టును ఫిష్ ఆకారంలో నిర్మిస్తున్నారు. హుద్ హుద్ వంటి తుపాన్లు వచ్చినా తట్టుకునేలా, గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మాణం చేపట్టారు. 27 సెంటీమీటర్ల వర్షం ఒకేసారి కురిసినా.. ఆ నీరంతా బయటకు వెళ్లిపోయేలా డ్రైనేజీ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. రోజుకు 200 విమానాలు ఇక్కడ ఆగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. రాత్రివేళల్లో 18 విమానాలు పార్కింగ్ చేసుకోవచ్చు. 14 ఇమిగ్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. సెల్ఫ్ బ్యాగేజీ, బోర్డింగ్, సెల్ఫ్ కిచెన్, స్మార్ట్ ట్రాలీలు తదితర ఆధునిక వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాక జూన్ 26న లాంఛనంగా ప్రారంభం కానుంది. జులై తొలివారం నుంచి విమానాల రాకపోకలు మొదలుకానున్నాయి.






