- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తరాంధ్ర అభివృద్ధికి గగనపథం.. రేపు భోగాపురం ఎయిర్‌పోర్టులో ట్రయల్ రన్
భోగాపురంలో నిర్మాణం పూర్తికి చేరువైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మరో కీలక దశకు చేరుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: భోగాపురంలో నిర్మాణం పూర్తికి చేరువైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మరో కీలక దశకు చేరుకుంది. దాదాపు 95 శాతం పనులు పూర్తయిన ఈ ఎయిర్‌పోర్టులో రేపు ఉదయం 10:15 గంటలకు ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా డిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రత్యేక విమానం రానుంది. అదే విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా భోగాపురం చేరుకోనున్నారు. 3.8 కిలోమీటర్ల పొడవుతో రూపొందించిన రన్‌వే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించబడింది. ఈ రన్‌వే రెండు వైపులా ల్యాండింగ్‌కు అనువుగా ఉండగా, రోజుకు దాదాపు 300 విమానాలు ల్యాండ్ అయ్యే పూర్తి సామర్థ్యం ఈ విమానాశ్రయానికి ఉందని అధికారులు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రతిష్టాత్మకంగా ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు.
రన్‌వే పనులు దాదాపుగా పూర్తయ్యాయని, టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా ఏర్పాట్లు తుది దశలో ఉన్నాయని తెలిపారు. ట్రయల్ రన్ విజయవంతమైతే జూన్ నెలలో విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించి, పూర్తి స్థాయి ఆపరేషన్లు చేపట్టాలని నిర్మాణ సంస్థ జీఎంఆర్ ప్రణాళిక రూపొందించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు లభించనుందని, విశాఖపట్నాన్ని అంతర్జాతీయ విమాన రవాణా పటంలో మరింత బలంగా నిలిపే అవకాశాలు ఏర్పడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






