Trending: మంత్రి గారు ఇదేం పద్ధతి..? సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-07 12:09:17  IST  )

రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతూ.. ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తోంది.

Trending: మంత్రి గారు ఇదేం పద్ధతి..? సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతూ.. ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తోంది. ఇక మంత్రులు వారికి కేటాయించిన శాఖలపై నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళా మంత్రి వ్యవహారం సోషల్ మీడియా (Social Media)లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. జూన్ 1న సత్యసాయి జిల్లాలో కలెక్టర్ చేతన్ (Collector Chetan) అధ్యక్షతన సమీక్షా సమావేశానికి మంత్రి సవిత (Minister Savitha) హాజరయ్యారు.

ఈ క్రమంలోనే ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ.. సీఎస్డీటీ (CSDT) బొకే అందజేయగా.. అమె కోపంతో ఒక్కసారిగా వెనక్కి విసిరేశారు. అయితే, సాక్షాత్తూ కలెక్టర్ ఎదుటే ఈ ఘటన జరగ్గా.. అక్కుడున్న వారు మంత్రి సవిత తీరును చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే, అదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన పలువురు నెటిజన్లు.. బొకే ఇస్తే తీసుకుని పక్కకు పెట్టాలి, లేకపోతే సిబ్బందికి ఇవ్వాలి కానీ మంత్రి అలా అమర్యాదగా ప్రవర్తించడం ఏంటని ఫైర్ అవుతున్నారు. ఈ విషయం సీఎం చంద్రబాబుకు వరకు వెళితే.. ఆయన సదరు మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.

Next Story