- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trending: ఆంధ్రాలో కోడి పందాల జోరు.. గెలిచిన వాళ్లకు బహుమతిగా ‘మహీంద్రా థార్’
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంక్రాంతి (Sankranti) పండుగ ట్రెండ్ మారింది. జనాలు గతంలో పండుగ అనగానే పిండి వంటలు, భోగి మంటలు, ముత్యాల ముగ్గులపై ఫోకస్ పెట్టే వారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంక్రాంతి (Sankranti) పండుగ ట్రెండ్ మారింది. జనాలు గతంలో పండుగ అనగానే పిండి వంటలు, భోగి మంటలు, ముత్యాల ముగ్గులపై ఫోకస్ పెట్టే వారు. కానీ, కాలక్రమేనా సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ మారుతూ వచ్చాయి. ఈ రోజుల్లో కొడి పందాలు లేనిదే సంక్రాంతి పండగ జరగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పందాలపై ఆంక్షలు ఉన్నా.. బరులు గీసీ ఎవరికి వారగా.. గ్రామ శివారు ప్రాంతాలు, ఫామ్ హౌజ్‌లలో రూ.కోట్లలో పందాలు కాస్తున్నారు. ఇక కోడి పందాలపై ఆసక్తి ఉన్న కొందరు తెలంగాణ (Telanagana) నుంచి ఆంధ్రాకు వెళ్లి మరీ పందాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఈ క్రమంలోనే కాకినాడ (Kakinada) జిల్లాలో కోడి పందాలకు పెట్టింది పేరు. అయితే, పెనుగుదురు (Penuguduru) కోడి పందాల్లో ఏకంగా నిర్వహకులు మహీంద్రా కంపెనీ (Mahindra Company)కి చెందిన థార్ జీప్ (Thar Jeep)ను బహుమతిగా పెట్టారు. దీంతో ఎలాగైనా.. పందెంలో గెలిచి థార్ జీపును చేజిక్కించుకునేందుకు పందెం రాయుళ్లు అంతా రంగంలోకి దిగారు. పెనుగుదురు కోడి పందాల్లో ఇవాళ ఒక్కరోజే దాదాపు రూ.5 కోట్లకు పైగా చేతులు మారుతాయని పందెం రాయుళ్లు అంచనా వేస్తున్నారు.






