Raod Accident : ఏపీలో ట్రావెల్ బస్సు బోల్తా.. 17 మందికి తీవ్ర గాయాలు

by Muthe.Rajitha |

ఏపీ(AP)లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది.

Raod Accident : ఏపీలో ట్రావెల్ బస్సు బోల్తా.. 17 మందికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ / సూళ్లూరుపేట : ఏపీ(AP)లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. తిరుపతిలోని సూళ్లూరుపేట(Sullurupeta) పట్టణానికి సమీపంలో ఉన్న కలకత్తా- చెన్నై జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సంఘటనలో 17 గురికి తీవ్ర గాయాలయ్యాయి. పాండిచ్చేరి నుండి, విజయవాడకు 34 మంది ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రయాణికుల్లో 17 మందికి గాయాలు కావడంతో వారిని సమీపంలో ఉన్న సిహెచ్సికి తరలించి వైద్యం అందించారు. సమాచారం అందుకున్న సూళ్లూరుపేట ఎస్సై బ్రహ్మనాయుడు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి ట్రావెల్ బస్సు అతి వేగంతో ప్రయాణించడంమే కారణమని ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన మీడియాకు వెల్లడించారు.

Next Story