పారదర్శంగా భూముల రీసర్వే.. ప్రతి గ్రామానికి సర్వే బృందం

by Thanuru Gopichand |

ఏపీలో భూముల రీసర్వే పాదర్శకంగా నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్​ తెలిపారు.

పారదర్శంగా భూముల రీసర్వే.. ప్రతి గ్రామానికి సర్వే బృందం
X

దిశ, డైనమిక్​ బ్యూరో : ఏపీలో భూముల రీసర్వే పాదర్శకంగా నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్​(Anagani)తెలిపారు. భూముల రీసర్వే, భూ రికార్డుల డిజిటలైజేషన్​పై కేంద్ర గ్రామీనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గుంటూరులోని ఐటీసీ హోటల్​లో వర్క్​షాప్​ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైసీపీ పాలనలో భూముల రీసర్వే ప్రహసనంగా మారిందన్నారు. తాము భూ యజమానుల నుంచి వచ్చిన వేల అభ్యతంరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి సభ నిర్వహించిన అభ్యంతరాలు వింటున్నామన్నారు. రీసర్వే కోసం కేటాయించిన నిధులు దానికోసమే వినియోగించాలన్నారు. 2,500 ఎకరాలు ఉన్న ప్రతి గ్రామానికి ప్రత్యే క సర్వే బృందాన్ని పంపిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం భూ సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకుందన్నారు. రైతులకు భూమి సెంటిమెంట్ ఉంటుందని .. దానిని జగన్​ప్రభుత్వం గుర్తించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని చక్కదిద్దేలా చర్యలు చేపట్టామని తెలిపారు.

వందేళ్ల తర్వాత జరుగుతున్న భూముల రీసర్వే (Land survey) జాగ్రత్తగా చేయాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్​(Pemmasani) సూచించారు. సిబ్బంది కొరత, నిధుల సమస్య ను అధిగమించడంపై దృష్టి సారించామన్నారు. భూ వివాదాలు ఏళ్ల తరబడి కోర్టులో పెండింగ్​లో ఉంటున్నాయని తెలిపారు. అమెరికాలో మన ఇళ్లు, భూమి వద్దకే అధికారులు వచ్చి రిజిస్ట్రేషన్​చేసి వెళతారు అని అన్నారు. నేను అక్కడ ఇళ్లు కొన్నాక 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్​కావడంతో ఆశ్చపోయానన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎల్​ఏ అధికారులు పాల్గొన్నారు.

Next Story