రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలు షురూ.. వాళ్లకు మాత్రమే మినహాయింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-16 03:27:07  IST  )

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు షురూ అయ్యాయి...

రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలు షురూ.. వాళ్లకు మాత్రమే మినహాయింపు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల(Government Employees) బదిలీలు షురూ అయ్యాయి. జూన్ రెండు వరకూ ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు బదిలీలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అటు సాధారాణ బదిలీలపైనా కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ బదిలీలపై ఇప్పటి వరకూ ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది.

ఒకే చోట ఐదేళ్లు పని చేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి చేసింది. పదోన్నతి పొంది ఒకే చోట ఐదేళ్ల పని చేసి ఉద్యోగులనూ కచ్చితంగా ట్రాన్స్‌ఫర్ చేస్తోంది. ఐదేళ్లలోపు పని చేసిన ఉద్యోగులకు వారి వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీ చేస్తోంది. మరో ఏడాదిలో రిటైర్ కాబోతున్న ఉద్యోగులకు శుభవార్త వినిపించింది. వారిని బదిలీ నుంచి మినహాయించింది.

ఈ బదిలీలో అంధ ఉద్యోగులకు ప్రాధాన్యత కల్పించింది. మానస్మిక రుగ్మత ఉన్న ఉన్న పిల్లల తల్లిదండ్రులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇచ్చింది. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఈ బదిలీల్లో ప్రాధాన్యత కల్పించింది. వితంతు ఉద్యోగులైతే ప్రభుత్వం వారి వినతి మేరకే వదిలేసింది. స్పౌజ్ ఉద్యోగులైతే వారిద్దరూ ఒకేచోట పని చేసేందుకు లేదా దగ్గరి ప్రాంతాల్లో అవకాశం కల్పించింది.

Next Story